News

వైద్యం వికటించి పసికందు మృతి


నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. ప్రసవం కోసం ఓ మహిళ స్థానిక ఉమ జనరల్‌ నర్సింగ్‌ హోమ్‌కు వచ్చింది. ఆపరేషన్‌ చేసిన వైద్యులు బిడ్డ చనిపోయినట్టు చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో బ్లేడు కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై బిడ్డ అక్కడికక్కడే మృతిచెందిందని చెబుతున్నారు. ఆస్పత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.